IB Junior Intelligence Officer Grade - 2 Recruitment 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు
IB Junior Intelligence Officer Grade - 2 Recruitment 2025:
ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడు 2 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ IB Junior Intelligence Officer Grade - 2 Recruitment 2025 ద్వారా మొత్తంగా 394 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ 394 ఉద్యోగాలలో కేటగిరి వైజ్ అన్ రిజర్వ్ అభ్యర్థులకు 157 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 32 పోస్టులు, ఓబిసి 117 పోస్టులు, ఎస్సీ 60 పోస్టులు, ఎస్టీకి 28 పోస్టులు కేటాయించడం జరిగింది.
ఈ IB Junior Intelligence Officer Grade - 2 Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆగస్టు 23, 2025 వ తేదీ నుండి సెప్టెంబర్ 14, 2025వ తేదీలోపు ఆన్లైన్లో www.mha.gov.in లేదా www.ncs.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఈ IB Junior Intelligence Officer Grade - 2 Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 27 సంవత్సరముల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
లేదా
బ్యాచిలర్స్ డిగ్రీ లో సైన్సుతో ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
లేదా
కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
• Tier-1: ఆన్లైన్ ఎగ్జామ్
• Tier-2: స్కిల్ టెస్ట్
• Tier-3: ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్
Exam Centre:
ఆంధ్ర ప్రదేశ్:
అనంతపూర్
గుంటూరు
కడప
కాకినాడ
కర్నూలు
నెల్లూరు
రాజమండ్రి
తిరుపతి
విజయవాడ
విశాఖపట్నం
విజయనగరం
తెలంగాణ:
హైదరాబాదు
కరీంనగర్
ఖమ్మం
మహబూబ్ నగర్
వరంగల్
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ చార్జెస్ 550 రూపాయలు మరియు ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలను మొత్తంగా 650 రూపాయలను చెల్లించి అప్లై చేసుకోవాలి.
మహిళలు ,ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ చార్జెస్ 550 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Salary:
ఈ ఉద్యోగాలు లెవెల్ 4 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 25,500-81,100 రూపాయల మధ్య బేసిక్ పే ఉంటుంది. అలాగే అధర్ అలవెన్సెస్ ఉంటాయి.
Official Website:
0 కామెంట్లు